TG: మూడు నెలల జీతాలు చెల్లించకపోవడంతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మిషన్ భగీరథ కార్మికులు ఇవాళ్టి అర్ధరాత్రి నుంచి సమ్మెకు దిగనున్నారు. దీంతో 21 మండలాల్లో తాగునీటి సరఫరా నిలిచిపోనుంది. అధికారులతో జరిగిన చర్చలు విఫలమవడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రతి నెల 5వ తేదీలోపు జీతాలు, పెండింగ్ జీతాలు చెల్లించాలని.. కనీస వేతనాలు, ఉద్యోగ భద్రత కల్పించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.