VZM: సారిపల్లిలో ఉన్న జిల్లా పోలీస్ శిక్షణ కేంద్రాన్ని ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ సోమవారం ఆకస్మిక సందర్శించారు. శిక్షణ కేంద్రానికి త్వరలో 140 మంది ట్రైనీ కానిస్టేబుల్స్ రానున్నందున ఎటువంటి ఇబ్బందులూ తలెత్తకుండా అవసరమైన మౌలిక వసతులు త్వరితగతిన కల్పించాలని అధికారులను ఆదేశించారు. ఎస్పీ వెంట అదనపు ఎస్పీ సౌమ్యాలత, ఎ.ఆర్ అదనపు ఎస్పీ వీరకుమార్ ఉన్నారు.