ప్రకాశం: పెద్దచెర్లపల్లి మండల కేంద్రంలోని స్థానిక పోలీస్ స్టేషన్ను జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్లో రికార్డులు పరిశీలించారు. పెండింగ్లో ఉన్న కేసులను వెంటనే పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఎస్పీ వెంట కనిగిరి డీఎస్పీ సాయి యశ్వంత్ ఈశ్వర్, సీఐ ఉన్నారు.