NGKL: కల్వకుర్తి పట్టణంలో ఆర్డీవో ఆఫీస్ పక్కన ఉన్న విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ ప్రమాదకరంగా మారింది. ట్రాన్స్ఫార్మర్ చుట్టూ రక్షణ కంచె లేకపోవడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఈ ప్రాంతం వాహనాలతో, ప్రజలతో రద్దగా ఉంటుంది. విద్యుత్ అధికారులు స్పందించి ట్రాన్స్ ఫార్మర్ చుట్టూ కంచె ఏర్పాటు చేయాలని స్థానిక ప్రజలు వాహనదారులు కోరుతున్నారు.