మేడ్చల్: కూకట్‌పల్లిలో సీనియర్ సివిల్ జడ్జ్ కోర్టు అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా సీనియర్ న్యాయవాది మాతంగి అఖిలేశ్ నియమితులయ్యారు. రాష్ట్ర హోంశాఖలోని డైరెక్టరేట్ ఆఫ్ ప్రాసిక్యూషన్ ఉత్తర్వులు జారీ చేసింది. 25 ఏళ్లుగా న్యాయవృత్తిలో ఉన్న అఖిలేశ్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా పనిచేశారు. సోమవారం కోర్టులో బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా పలువురు శుభాకాంక్షలు తెలిపారు.