SRCL: ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను పరిష్కరించడమే ప్రజావాణి ఉద్దేశం. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ లక్ష్మి కిరణ్, మునిసిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్, జిల్లా రెవెన్యూ అధికారి వెంకటేశ్వర్లు ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. 318 అర్జీలు రాగా సత్వర పరిష్కారం కోసం వాటిని వివిధ శాఖల అధికారులకు బదిలీ చేశారు. పెండింగ్ దరఖాస్తులను పరిష్కరించాలన్నారు.