AP: వ్యవసాయంపై 62 శాతం రాష్ట్ర ప్రజలు ఆధారపడ్డారని CM చంద్రబాబు తెలిపారు. రాష్ట్రానికి 35% ఆదాయం వ్యవసాయం, 23% పరిశ్రమలు, 41% ఆదాయం సేవారంగం నుంచి వస్తుందని వివరించారు. పశుసంపదపై 19 లక్షల కుటుంబాలు ఆధారపడ్డాయని అన్నారు. పాలు, మాంసం, గుడ్ల ఉత్పత్తి మరింత పెరగాలని చెప్పారు. స్వయంసహాయ సంఘాల మహిళల ఆదాయం పెంచుతున్నామన్నారు. గోకులాలకు గడ్డి కూడా సరఫరా చేస్తున్నామని పేర్కొన్నారు.