AP: స్వదేశీ, మేకిన్ ఇండియా ప్రచారం మరింత ఊపందుకోవాలని సీఎం చంద్రబాబు అన్నారు. గృహోపయోగ వస్తువుల వినియోగం బాగా పెరుగుతోందని తెలిపారు. భారతీయ ఉత్పత్తులు కొని దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. నాలుగు వారాల్లో రాష్ట్రవ్యాప్తంగా 65 వేల మీటింగ్లు నిర్వహిస్తామని ప్రకటించారు. జీఎస్టీ ప్రయోజనాల కరపత్రాలను ఇంటింటికీ పంచుతామని చెప్పారు.