GNTR: తెనాలి ప్రజలకు ట్రాఫిక్ కష్టాలు తప్పడం లేదు. పండుగ రోజుల్లో కూడా ట్రాఫిక్ వలయంలో చిక్కుకొని ఇబ్బందులు పడుతున్నామంటూ వాపోతున్నారు. సోమవారం మెయిన్ రోడ్డులో ట్రాఫిక్ సమస్య ఏర్పడి వాహనదారులు, ప్రజలు తీవ్ర అవస్థలు పడ్డారు. నో ఎంట్రీ బోర్డులు ఉన్నప్పటికీ వాటిని దాటుకుంటూ మరీ ఆటోలు ఈ మార్గంలోకి రావడంతో ఈ సమస్య తలెత్తింది.