TG: గాజులరామారంలో హైడ్రా కూల్చివేతలపై బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. గాజులరామారంలో పేదల గుడిసెలు కూలగొట్టి, రూ.15 వేల కోట్ల విలువైన స్థలం కాపాడామని ప్రచారం చేసుకోవడం సిగ్గుచేటని విమర్శించారు. బతుకమ్మ పండుగ రోజున పేదలను వేధిస్తున్నారని కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడ్డారు.