GDWL: జిల్లాలోని హోంగార్డులకు ఎస్పీ శ్రీనివాసరావు సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో రెయిన్ కోట్లు, ఉలెన్ జాకెట్లు అందజేశారు. పోలీసులతో కలిసి సమర్థవంతంగా విధులు నిర్వహిస్తున్న హోంగార్డుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని డీజీపీ కార్యాలయం నుంచి వీటిని పంపిణీ చేశారని ఎస్పీ తెలిపారు. హోంగార్డులకు ఏమైనా సమస్యలుంటే తనను సంప్రదించవచ్చని అన్నారు.