NTR: తుళ్లూరు స్కిల్ హబ్లో ఈ నెల 24న 5 ప్రముఖ కంపెనీలలో 450కి పైగా ఉద్యోగాల భర్తీకి జాబ్ మేళా నిర్వహిస్తున్నామని CRDA కమిషనర్ కన్నబాబు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని APSSDC సౌజన్యంతో నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. SSC, ఇంటర్, డిగ్రీ, డిప్లొమా, బీ.ఫార్మసీ పూర్తి చేసిన వారు ఈ జాబ్ మేళాకు హాజరు కావచ్చన్నారు.