NLG:పెట్రోల్ బంకుల్లో లూజ్ సేల్స్ నిలిపివేయాలని పౌరసరఫరాలశాఖ ఎన్ఫోర్స్మెంట్ DT మాచన రఘునందన్ స్పష్టం చేశారు. సోమవారం గుర్రంపోడులోని పలు పెట్రోల్ బంకులను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు.పెట్రోల్‌ను డ్రమ్ముల్లో,బాటిళ్లలో అమ్మడం నేరమని ఆయన పేర్కొన్నారు. అలాగే బంకుల్లో వినియోగదారుల కోసం వాష్ రూమ్, ఎయిర్ పిల్డింగ్ యంత్రాలు అందుబాటులో ఉంచాలని సూచించారు.