SDPT: దేవీ నవరాత్రి ఉత్సవాలు ప్రశాంతంగా జరుపుకోవాలని సిద్దిపేట పోలీస్ కమిషనర్ అనురాధ సూచించారు. దుర్గామాత ప్రతిష్ఠకు సంబంధిత PS నుంచి అనుమతి తీసుకోవాలన్నారు. వర్షాలతో మండపాల్లో విద్యుత్ జాగ్రత్తలు తీసుకోవాలని, ట్రాఫిక్కు అంతరాయం కలిగించకుండా వాలంటీర్లను ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు. ఇబ్బందులకు 8712667100కు సమాచారం ఇవ్వాలని కమిషనర్ సూచించారు.