CTR: సదుం మండలంలో నూతనంగా ఏర్పాటు చేయనున్న వైసీపీ గ్రామ కమిటీలు సమర్థవంతంగా పనిచేసేలా చూడాలని నాయకులకు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సూచించారు. తిరుపతిలోని ఆయన క్యాంప్ కార్యాలయంలో నూతనంగా ఏర్పాటు చేయనున్న మండల కమిటీల వివరాలు జడ్పీటీసీ సోమశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో సోమవారం నాయకులు అందజేశారు. త్వరలోనే కమిటీలు ఖరారు కానున్నట్లు నాయకులు తెలిపారు.