GST సంస్కరణలపై దేశ ప్రజలకు ప్రధాని మోదీ లేఖ రాశారు. ‘సంస్కరణలు ప్రజల్లో పొదుపును పెంచుతాయి. వీటితో అన్ని వర్గాలకూ లబ్ది జరుగుతుంది. వికసిత్ భారత్ సాధనకు దోహదం చేస్తాయి. స్థానిక తయారీదారులకు ఊతమిస్తాయి. పెట్టుబడులకు అనుకూల వాతావరణాన్ని రాష్ట్రాలు కల్పించాలి. స్వదేశీ ఉత్పత్తులే విక్రయించాలని దుకాణదారులకు విజ్ఞప్తి. ప్రజలు స్వదేశీ ఉత్పత్తులే కొనాలి.. వినియోగించాలి’ అని కోరారు.