E.G: రాజానగరం నియోజకవర్గాన్ని విద్యా నిలయంగా, ఉన్నత విద్యకు కేంద్రంగా అభివృద్ధి చేయాలని రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ విద్యాశాఖ మంత్రి లోకేష్‌ను కోరారు. సోమవారం విజయవాడలో మంత్రి లోకేష్‌ను కలిసి రాజానగరంలో పలు విద్యాసంస్థల ఏర్పాటు, అభివృద్ధి కొరకు వినతిపత్రం అందించారు. రాజానగరం, కోరుకొండ ప్రాంతాల్లో డిగ్రీ కాలేజీలను ఏర్పాటు చేయాలని కోరారు.