GNTR: తెనాలిలో శిథిలావస్థకు చేరిన చెంచుపేట రైల్వే ఓవర్ బ్రిడ్జికి మరమ్మతులు చేయించాలని కోరుతూ సీపీఎం నాయకులు బాబు ప్రసాద్ సబ్ కలెక్టర్ సంజనా సింహాకు వినతిపత్రం అందజేశారు. ఆరు దశాబ్దాల క్రితం నిర్మించిన ఈ బ్రిడ్జి పూర్తిగా దెబ్బతినిందని, దీనితో పాటు ఫుట్పాత్ కూడా పాడైందని తెలిపారు. వెంటనే బ్రిడ్జికి మరమ్మతులు చేసి ప్రజల ఇబ్బందులు తొలగించాలని కోరారు.