మేడ్చల్: నగరంలో భారీ వర్షాల కారణంగా నష్టపోయిన వరద బాధితులకు నష్టపరిహారం చెల్లించాలని CPI ఆధ్వర్యంలో మారేడ్ పల్లి ఎమ్మార్వో కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. అనంతరం తహసీల్దార్‌కు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా CPI సికింద్రాబాద్ కార్యదర్శి శ్రీనివాస్ మాట్లాడుతూ.. నష్టపోయిన పేద ప్రజలకు ప్రభుత్వం ఇప్పటివరకు ఎటువంటి సహాయం అందించలేదని ఆరోపించారు.