MHBD: మహబూబాబాద్ పట్టణంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిని స్థానిక MLA భూక్య మురళీనాయక్ సోమవారం ఆకస్మిక తనిఖీ చేశారు. ఆసుపత్రిలో అందిస్తున్న వైద్యసేవల గురించి ఎమ్మెల్యే ఆరాతీశారు. దవాఖానకు వచ్చే పేద ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని సూచించారు. ఆరోగ్య విషయంలో ఎవరైనా నిర్లక్ష్యం వహించినా, రోగుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన సహించేది లేదని హెచ్చరించారు.