VSP: గూగుల్ డేటా సెంటర్ కోసం తర్లువాడలో భూములిచ్చిన రైతులకు న్యాయం చేస్తామని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. సోమవారం నగర పర్యటనకు వచ్చిన ఆయనకు భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు స్వాగతం పలికారు. గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ, తర్లువాడలో మార్కెట్ రేటు పెంపును వర్తింపజేయలేదని, రైతులు అదనపు పరిహారం కోరుతున్నారని తెలియజేశారు.