AKP: కోటవురట్ల మండలం ఎండపల్లిలో సోమవారం పోలీసులు 100 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు నర్సీపట్నం డీఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. అల్లూరి జిల్లా నుంచి తీసుకొచ్చిన గంజాయి మూటలను వేరే వాహనంలోకి మారుస్తుండగా స్థానిక ఎస్సై రమేష్, సీఐ రామకృష్ణ ఆధ్వర్యంలో పోలీసులు దాడి చేసి పట్టుకున్నారు. అల్లూరి జిల్లాకు చెందిన 5గురు, యూపీకి చెందిన ఇద్దరిని అరెస్టు చేసారు.