NTR: దేవాదాయ శాఖ కమిషనర్ రామచంద్ర మోహన్ దసరా ఉత్సవాల తొలిరోజున ఇంద్రకీలాద్రిపై భక్తుల కోసం చేసిన ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రసాదంతో పాటు, అన్నదాన కేంద్రం, అలాగే విధుల్లో ఉన్న సిబ్బందికి ఏర్పాటు చేసిన భోజన వసతులను తనిఖీ చేశారు. భక్తులకు ప్రసాదం పంపిణీ, అన్నదానం సక్రమంగా జరిగేలా చూడాలని అధికారులను ఆదేశించారు.