VZM: జిల్లాలో రైతులకు అందించే సేవలు కోసం డీసీసీబీకు సహకారం అందించాలని జిల్లా డీసీసీబీ ఛైర్మన్ కిమిడి నాగార్జున కోరారు. సోమవారం విజయవాడలో ఆప్కాబ్ మేనేజింగ్ డైరెక్టర్ R.శ్రీనాథ్ రెడ్డి కలిసి వినతిపత్రం అందజేశారు. జిల్లాలో రైతులకు ఇచ్చే పంట రుణాలు కోసం అదనంగా జిల్లాకు ఫైనాన్సు మంజూరు చేయాలని ప్రస్తుతం 5% ఉన్న జనరల్ బ్యాంకింగ్ లిమిట్‌ను మరో 5% పెంచాలన్నారు.