MDK: నిజాంపేట మండలం ర్యాలమడుగు, పరిసర ప్రాంత గిరిజన తండాల్లో సోమవారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. క్రమం తప్పకుండా వర్షాలు కురుస్తున్నందున రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈపాటికి పంటలు దెబ్బతిన్నాయని రైతులు దిగులు పడుతుండగా, మళ్లీ వర్షం వల్ల మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్టుగా తమ పరిస్థితి మారిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.