కోనసీమ: అమలాపురంలో రెండు రోజుల ముందుగానే OG సినిమా సందడి నెలకొంది. లలితా థియేటర్ వద్ద సోమవారం పవన్ కల్యాణ్ నటించిన OG సినిమా తొలి టికెట్కు వేలం పాట నిర్వహించారు. ఈ వేలంలో అల్లవరం మండలం బెండమూర్లంక గ్రామానికి చెందిన గుర్రం కృష్ణ, అతని స్నేహితులు రూ.60 వేలకు టికెట్కు దక్కించుకున్నారు.