HYD: రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య రాష్ట్రప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. గత 18 నెలలుగా ఎస్టీ హాస్టల్స్ మెస్ బిల్లులు చెల్లించడం లేదని, వార్డెన్లు వడ్డీలకు అప్పులు చేసి నడుపుతున్నారని ఆరోపించారు. బడా కాంట్రాక్టర్లకు వేలకోట్లు ఇస్తున్నారు, విద్యార్థులకు బిల్లులు చెల్లించడానికి వందకోట్లు లేవా అని ప్రశ్నించారు. బిల్లులు చెల్లించకపోతే ప్రజా భవన్ ముట్టడి చేస్తామన్నారు.