MHBD: మహబూబాబాద్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలోని డోర్నకల్, అమ్మపాలెం,తోడేళ్లగూడెం గ్రామాలలో శుక్రవారం ఎక్సైజ్ పోలీసులు ఆకస్మికంగా దాడులను నిర్వహించారు. ఈ సందర్భంగా ఐదుగురు నిందితులను అదుపులోకి తీసుకుని 14 లీటర్ల సారాతో పాటు 900 లీ.ల సారా తయారీకి ఉపయోగించే ముడి పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ సీఐ నాగేశ్వరరావు, సిబ్బంది పాల్గొన్నారు.