వరంగల్: ఉర్సుగుట్ట ప్రాంతంలో శుక్రవారం దారుణమైన ఘటన చోటు చేసుకుంది. అన్నారం గ్రామానికి చెందిన వినోద్ కరెంట్ పోల్ వేస్తూ ఉండగా ఆకస్మికంగా విద్యుత్ షాక్‌కి గురయ్యాడు. ఈ ఘటనలో ఆయన తీవ్ర గాయాలు పొందినట్లు సమాచారం. వెంటనే సహచరులు ఆసుపత్రికి తరలించారు. అధికారుల నిర్లక్ష్యమే ఈ ప్రమాదానికి కారణమని స్థానికులు ఆరోపిస్తున్నారు.