కాంగ్రెస్ ఓవర్సీస్ ఇన్ఛార్జ్ శామ్ పిట్రోడా మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. భారత విదేశాంగ విధానాలపై తీవ్ర విమర్శలు చేశారు. పొరుగుదేశాలకు ప్రాధాన్యమిచ్చేలా మన విధానాలు ఉండాలని అన్నారు. ఈ సందర్భంగా పాకిస్తాన్, బంగ్లాదేశ్, నేపాల్ దేశాలకు వెళ్తే తనకు సొంతింట్లో ఉన్న భావన కలుగుతుందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.