VZM: కొత్తవలస ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో ఉన్న సచివాలయాల్లో ప్రధానమంత్రి నరేంద్రమోదీ జన్మదినం సందర్భంగా ‘స్వస్త్ నారీ – సశక్త్ పరివార్ అభియాన్’ కార్యక్రమం శుక్రవారం సచివాలయం – 4లో నిర్వహించారు. రక్తపోటు, మధుమేహం, నోటి క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్తో బాధపడుతున్న రోగులను చూసినట్లు తెలిపారు. గర్భిణీ స్త్రీలు తీసుకోవాల్సిన ఆహారంపై అవగాహన కల్పించారు.