MBNR: భారతదేశ మీద భారత దేశ ప్రధాని నరేంద్ర మోదీకి ఉన్న అంకితభావం ఎంతో గొప్పదని జడ్చర్ల పట్టణ బీజేపీ అధ్యక్షులు అమర్నాథ్ గౌడ్ అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని సేవా పక్వాడ కార్యక్రమంలో భాగంగా జడ్చర్ల పట్టణంలోని కల్వకుర్తి రోడ్డులో ఉన్న శివాలయంలో స్వచ్ఛభారత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు పాల్గొన్నారు.