HYD: ఎట్టకేలకు హైడ్రా కమిషనర్ రంగనాథ్ వర్ష బీభత్స ప్రాంతాల్లో పర్యటించారు. ఎక్కడికక్కడ మ్యాన్ హోల్లను మూసివేయాలని, లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను ఆదుకునేందుకు సిద్ధంగా ఉండాలని సిబ్బందిని ఆదేశించారు. స్వయంగా లోతట్టు ప్రాంతాల్లో పర్యటించి పరిస్థితిని పరిశీలించారు. వర్షాలు ఇంకా పడే అవకాశం ఉన్నందున ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.