క్రికెటర్ అభిషేక్ శర్మ అద్భుత ప్రదర్శనకు రోహిత్ శర్మనే కారణమని మాజీ క్రికెటర్ అజయ్ జడేజా అన్నాడు. జట్టులో రోహిత్ తీసుకొచ్చిన దూకుడు విధానాన్ని అభిషేక్ కొనసాగిస్తున్నాడని వివరించాడు. అందుకే తక్కువ స్కోరుకే అవుటైనా అతడిని ఎవరూ ప్రశ్నించరని పేర్కొన్నాడు. జట్టులో 8 మంది బ్యాటర్లు ఉండడం కూడా అభిషేక్ దూకుడుగా ఆడటానికి కారణమని జడేజా విశ్లేషించాడు.