కేంద్ర హోంమంత్రి అమిత్ షా దేశంలోని మహిళలకు షాపింగ్‌పై కొత్త సూచనలిచ్చారు. ఈనెల 22 నుంచి కొత్త జీఎస్టీ రేట్లు అమల్లోకి వస్తున్నాయని.. ఈ రేట్ల తగ్గింపుతో దసరా, దీపావళి పండుగలకు ధారాళంగా షాపింగ్ చేయవచ్చని చెప్పారు. అయితే, ఈ షాపింగ్ కేవలం భారతదేశంలో తయారైన స్వదేశీ వస్తువులకే పరిమితం కావాలని కోరారు. స్వదేశీని ప్రోత్సహించడం ద్వారానే దేశం అభివృద్ధి చెందుతుందని అన్నారు.