కృష్ణా: తాడేపల్లిలో మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డిని పామర్రు మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ మర్యాదపూర్వకంగా గురువారం కలిశారు. నియోజకవర్గంలో టీడీపీ నేతలు చేస్తున్న అసత్య ప్రచారాలపై కైలా అనిల్ కుమార్ జగన్కు వివరించినట్లు తెలిపారు. “మన సమయం వస్తుంది, అబద్ధాలు ప్రచారం చేసే వారిని ప్రజల మధ్య తిప్పికొడదాం” అని జగన్ హామీ ఇచ్చారని ఆయన అన్నారు.