BDK: పోడు రైతులను ఇబ్బంది పెట్టకుండా రీసర్వే జరపాలిని జిల్లా దిశా కమిటీ సభ్యులు బొర్రా సురేష్ అన్నారు. ఈ నేపథ్యంలో ఇవాళ ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి రాహుల్కు వినతిపత్రం అందజేశారు. గత ప్రభుత్వ హయాంలో ఆదివాసీలకు చెందిన పోడుభూమిని సర్వే చేసి పట్టాలు ఇవ్వకుండా మోసం చేశారని ఆరోపించారు. వెంటనే రీ సర్వే జరిపి పట్టాలు ఇవ్వాలని అభ్యర్థించారు.