WGL: నల్లబెల్లి మండలం నందిగామ రేలకుంట గ్రామాల్లో ఎక్సైజ్ అధికారులు గురువారం దాడులు నిర్వహించి 45 లీటర్ల నాటు సారా, 1900 లీటర్ల చక్కెర పానకం స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో ఆరుగురిపై కేసులు నమోదు చేసినట్లు ఎక్సైజ్ సీఐ నరేష్ రెడ్డి తెలిపారు. ఇంకా ఎవరైనా నాటు సారా తయారీ, విక్రయం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.