NDL: ఆళ్లగడ్డలో అకాల వర్షాల కారణంగా వేల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయని, ఖరీఫ్ సీజన్లో వేసిన మొక్కజొన్న తెగుళ్లు, అతివృష్టితో చేతికి అందే సమయంలో నష్టపోయిందని వైసీపీ రాష్ట్ర కార్యదర్శి భూమా కిశోర్ రెడ్డి గురువారం విలేకర్ల సమావేశంలో ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నందున ప్రభుత్వం వెంటనే సహాయక చర్యలు చేపట్టి ఆదుకోవాలని ఆయన కోరారు.