SKLM: పర్యావరణం పట్ల ప్రతి ఒక్కరు దృష్టి సారించాలని నరసన్నపేట ఎమ్మెల్యే రమణమూర్తి అన్నారు. పోలాకి మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో “స్వర్ణాంధ్ర-స్వచ్ఛ ఆంధ్ర” కార్యక్రమం శనివారం అధికారులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని మొక్కలు నాటారు. అందరూ బాధ్యతగా స్వర్ణాంధ్ర-స్వచ్ఛ ఆంధ్ర నిర్మాణానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.