ASR: స్వాతంత్య్ర సమరయోధుల మ్యూజియం నిర్మాణాలను మూడు నెలల్లో పూర్తి చేయాలని ఐటీడీఏ పీవో తిరుమణి శ్రీపూజ అధికారులను ఆదేశించారు. మంగళవారం చింతపల్లి మండలంలో పర్యటించారు. స్వాతంత్య్ర సమరయోధుల మ్యూజియం నిర్మాణ పనులను పరిశీలించారు. మ్యూజియం నిర్మాణాలను డిసెంబరు నెలాఖరు నాటికి పూర్తి చేయాలని ఆదేశించారు. లంబసింగి అతిథి గృహాన్ని అందుబాటులోకి తీసుకు రావాలన్నారు.