JGL: జగిత్యాలకు విచ్చేసిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రేణుక యారను కలెక్టర్ సత్యప్రసాద్ శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. జగిత్యాల జిల్లా సీనియర్ సివిల్ జడ్జి న్యాయస్థానంలో జిల్లా న్యాయమూర్తులు, అధికారులతో సమావేశం నిర్వహించుటకు విచ్చేసిన ఆమెను ఆర్అండీబీ విశ్రాంత గృహములో మర్యాదపూర్వకంగా కలిసి పూలమొక్క అందజేశారు. వీరితోపాటు అధికారులు ఉన్నారు.