VZM: ఉత్తరాంధ్ర కల్పవల్లి శ్రీ పైడితల్లమ్మ అమ్మవారి సిరిమాను తిరిగే ప్రదేశాలను మంగళవారం ఉదయం కలెక్టర్ రామసుందర్ రెడ్డి, ఎస్పీ ఎ.ఆర్. దామోదర్ రెడ్డి సందర్శించారు. సిరిమాను తిరిగే ప్రదేశాలను, పార్కింగ్ ప్రాంతాలను క్షుణ్ణంగా పరిశీలించారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఈ సందర్భంగా శిథిలావస్థలో ఉన్న భవనాలను పరిశీలించారు.