ప్రకాశం: జిల్లాకు త్వరలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రానున్నారు. ఒంగోలులో బాలినేని ఆధ్వర్యంలో డొక్కా సీతమ్మ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయనున్నారు. అక్టోబర్ 4వ తేదీన ఈ కార్యక్రమ ప్రారంభానికి పవన్ వస్తారని సమాచారం. అమరావతిలో బాలినేని శ్రీనివాసరెడ్డి నిన్న డిప్యూటీ సీఎంను కలిసి ఈ మేరకు చర్చించారు.