W.G: అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేసేందుకు పోలీస్ శాఖ ప్రయత్నిస్తుంది. జిల్లా ఎస్పీ ఆదేశాలతో నిర్మానుష్య ప్రదేశాలలో అసాంఘిక కార్యకలాపాలను నివారించేందుకు పాలకొల్లు టౌన్ పోలీసులు సోమవారం డ్రోన్ ద్వారా పలు ప్రాంతాలలో గస్తీని నిర్వహిచారు. ఈ మేరకు నిర్మానుష్య ప్రదేశాలలో సంచరిస్తున్న యువతకు కౌన్సెలింగ్ ఇచ్చారు.