SRPT: మోతె మండలం మామిల్లగూడెం గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ మాజీ మండల అధ్యక్షుడు, మాజీ సర్పంచ్ గట్టికొప్పుల వీరారెడ్డి బీజేపీలో చేరారు. ఆయనతో పాటు సిరికొండ గ్రామానికి చెందిన దామిడి గోపాల్ రెడ్డి కూడా కాషాయ కండువా కప్పుకున్నారు. సోమవారం రాత్రి హైదరాబాద్లో రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రామచందర్ రావు సమక్షంలో వీరు బీజేపీ పార్టీలో చేరడం జరిగింది.