ATP: జిల్లా ఎస్పీ జగదీష్ ఆదేశాల మేరకు పోలీసులు విజిబుల్ పోలీసింగ్ చేపట్టారు. రోడ్డు భద్రతా నిబంధనలు ఉల్లంఘించిన వాహనదారులకు జరిమానాలు విధించారు. డ్రంకన్ డ్రైవింగ్ పరీక్షలు నిర్వహించి మద్యం తాగిన వారిపై కఠిన చర్యలు తీసుకున్నారు. జిల్లా ప్రజల భద్రత కోసం పెట్రోలింగ్, నిఘా చర్యలు ముమ్మరం చేశామని ఎస్పీ తెలిపారు.