కృష్ణా: పంట కోత ప్రయోగాలపై సోమవారం ఉంగుటూరులో VAAలకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని MAO జి.రమేష్, ASO కె.రత్నారావు పర్యవేక్షించారు. ప్రతి గ్రామంలో ఫారం-1 సిద్ధం చేసి, సర్వే నంబర్ల ద్వారా యాదృచ్ఛికంగా పొలాలను ఎంపిక చేసి కోత అనంతరం దిగుబడి అంచనా వేయడం ద్వారా పంటల బీమా, అధికారిక ఉత్పత్తి అంచనాలకు వీటిని ఉపయోగిస్తారని వారు వివరించారు.