GDWL: అలంపూర్ శ్రీ జోగులాంబ అమ్మవారి శరన్నవరాత్రి బ్రహ్మోత్సవాలు సోమవారం ధ్వజారోహణంతో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా జరిగిన ధ్వజారోహణ, గంగమ్మ పండుగ పూజా కార్యక్రమాల్లో అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు ఎమ్మెల్యేకు శ్వేత వస్త్రాలు సమర్పించారు.