BPT: జిల్లాలో పారిశుద్ధ్యంపై సంబంధిత అధికారులు దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ సోమవారం తెలిపారు. అక్కడక్కడ ఎక్కువగా కొబ్బరి బొండాల చిప్పలు, ఎక్కడ పడితే అక్కడ చెత్త వేసిన దిబ్బలు ఉన్నాయని కలెక్టర్ పేర్కొన్నారు. వాటిని తొలగించి పరిసరాలను పరిశుభ్రంగా ఉండేటట్లు పంచాయతీ సెక్రటరీలు చూడాలని అధికారులను ఆదేశించారు.